పార్థసారథి ఆలయం

దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి గాంచిన 108  వైష్ణవ ఆలయాల్లో ఒకటి చెన్నైలో ఉంది. ఇక్కడి ట్రిప్లికేన్ లోని  ఈ ఆలయమే పార్థసారథి ఆలయం. ఇక్కడ స్వామీ వారు పార్థసారథి. (మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం సమయంలో  పార్థుడి (అర్జునుడి)కి రథ సారథిగా ఉండటంతో శ్రీ కృష్ణుడిని పార్థసారథి అని కూడా పిలుస్తారు). ఇక్కడి స్వామి మీసాలతో దర్శనం ఇవ్వడం విశేష అంశం.

ఆలయ నిర్మాణం

పార్థసారథి ఆలయం
చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8 వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తుంది. నగరంలోని ప్రాచీన కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఆలయంలో పార్థసారథితో పాటు శ్రీ దేవవల్లి అమ్మవారు, శ్రీ రంగనాథుడు, శ్రీ రాముడు, శ్రీ వరదరాజ స్వామి, యోగ నరసింహుడు, శ్రీ అండాళ్, శ్రీ ఆంజనేయుడు, ఆళ్వారులు, రామానుజుడు తదితరుల సన్నిధులు ఉన్నాయి. ఆలయంలో పార్థసారథి మరియు నరసింహుడికి వేర్వేరు ధజస్తంబాలు, వాకిళ్ళు   ఉన్నాయి.

పురాణ ప్రాశస్త్యం 
మూల విరాట్టు 
సుమతి అనే రాజుకు పార్థసారథిగా దర్శనమివ్వనున్నట్టు వేంకటాచలపతి ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రిప్లికేన్ లో దర్శనం ఇచ్చాడని, ఆ మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఆలయంలోని మూల విరాటుని మహాముని అగస్త్యుడు ప్రతిష్టించాడని ప్రతీతి. వైష్ణవ ఆచార్యుడు అయిన శ్రీ రామానుజుడు తల్లితండ్రులు ఇక్కడి పార్థసారథిని వద్ద సంతాన భాగ్యం కోసం ప్రార్ధించారని, దీంతో  ఆయనే వారికి రామనుజుడిగా జన్మించాడని కూడా ప్రతీతి. ఇక్కడి స్వామివారు మీసాలతో దర్శనం ఇవ్వడం తో పాటు
ఆలయ ప్రాకరంపై గీతోపదేశం శిల్పం
 చేతిలో తన ప్రధాన  ఆయుధమైన సుదర్శన చక్రం లేకుండానే దర్శనం ఇవ్వడం మరో విశేషం. కురుక్షేత్ర సంగ్రామంలో తను ఆయుధం పట్టబోనని వాగ్దానం చెయ్యడం అందుకు కారణమని చెబుతారు.


ఉత్సవం, దర్శన వేళలు

వైకుంట ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ వేశేషంగా జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో ఒకరోజు మాత్రం స్వామివారిని తిరుపతి వేంకటాచలపతి తరహాలో అలంకరిచి భక్తులకు ప్రసాదంగా స్వీట్లు పంచి పెడతారు. మిగతా రోజుల్లో పొంగలి, దద్ధోజనం, పులిహొర, వడ అందిస్తారు.  12 మంది ఆళ్వార్లలో ముగ్గురైన పేయాళ్వార్, తిరుమళిసై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఈ ఆలయంలోని దైవాలపైన స్తుతి చేస్తూ పాటలు రాశారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి