తమిళనాడులోని చెన్నైలో ఉన్న మెరీన బీచ్ ఉత్తరంలో ఉన్న సెయింట్ జార్జ్ ఫోర్ట్ సమీప ప్రాంతం నుండి దక్షిణంలోని ట్నాయో గార్ వరకు 13 కిలోమీటర్లు మేరకు విస్తరించింది. ఇది బంగాళాఖాతం తీర ప్రాంతం. ఇది ప్రపంచంలోని రెండో అతి పొడవైన బీచ్ గా ప్రచారంలో ఉన్నా అది అధికారిక ప్రకటన మాత్రం కాదు.
చరిత్ర
1881 వ సంవత్సరం ఓడరేవు నిర్మించే వరకు చాలా కాలంపాటు ఈ బీచ్ ప్రస్తుత రహదారికి చాలా సమీపంగా విస్తరించి ఉండేది. 1881 నుండి 1886 వరకు మద్రాస్ గవర్నర్‌గా వ్యవహరించిన మౌంట్ స్టార్ట్ ఎల్ఫిన్‌స్టోన్ గ్రాంట్ డఫ్ ఈ బీచ్ వెంబడి విహార ప్రదేశాన్ని నిర్మించడంతో పాటు దానికి మద్రాస్ మెరీనా అని పేరు పెట్టాడు.
ప్రస్తుతం
మెరీనా బీచ్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. చెన్నైకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఈ బీచ్‌ను సందర్శిస్తారు. ఇక్కడ స్మారకాలు, విగ్రహాలు, ఉదయం పూట వాహ్యాలీ, జాగర్ల ట్రాక్, పచ్చిక స్థలాలు వంటివి ఏర్పాటు చెయ్యడంతో ఈ బీచ్ అన్ని వయస్సుల వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తుంది. ఈ బీచ్ లో స్నానం చేయటం / ఈత కొట్టడం నిషిద్ధం. ఇక్కడి గాంధీ విగ్రహం వెనుక ఓ స్కేటింగ్ రింక్ ఉంది. కార్మిక విగ్రహం నుంచి లైట్ హౌస్ వరకు 2.8 కిలో మీటర్ల దూరం మేరకు కూర్చోడానికి వీలుగా 14 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అన్నా స్క్వేర్ నుండి లైట్ హౌస్ వరకు 3-కిమీ పొడవున ఆటంకం లేని కాలిబాట ఉంది. తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన "చెన్నై ఫర్ ఎవర్"లో భాగంగా 2005 సెప్టెంబరులో 1.5 మిలియన్ రూపాయలతో 34 అడుగుల ఎత్తైన, కృత్రిమ జలపాతం మెరీనాలో ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ అన్నా స్విమ్మింగ్ పూల్, మెరీనా స్విమ్మింగ్ పూల్, అక్వేరియం, మెరీనా క్రికెట్ గ్రౌండ్, డాక్టర్ అనిబెసెంట్ పార్క్ ఉన్నాయి.