సెయింట్ థామస్ మౌంట్

ఆలయం ఉన్న సెయింట్ థామస్ మౌంట్
చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంది. క్రైస్తవ రక్షకుడు అయిన ఏసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా  (థామస్) చనిపోయింది ఇక్కడే కావటం అందుకు కారణం. ఏసు క్రీస్తు పునర్థానం (మరణించిన తర్వాత మళ్ళీ బతకటం) తర్వాత క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఆయన శిష్యులు తలో దిక్కుకు వెళ్ళగా తోమా  మాత్రం పలు దేశాల్లో పర్యటించి క్రీస్తు శకం  52 - 72  మధ్య  కాలంలో చెన్నై చేరుకున్నాడు. ఇక్కడి మైలాపూరులో క్రైస్తవ మత వ్యాప్తికి కృషి చేశాడు. అయితే అప్పట్లో హిందు మతం వేళ్ళూనుకొని ఉండటంతో పలువురి ద్వేషానికి అయన గురైయ్యాడు. దీంతో ప్రస్తుతం 'చిన్న మలై' గా పిలుస్తున్న ప్రాంతానికి వచ్చి ఓ గుహలో ఆయన నివశించాడు. ఇక్కడ ఆయనపై హత్యా ప్రయత్నం జరగటంతో చిన్న మలై నుంచి తప్పించుకొని మూడు కిలో మీటర్ల ఆవల ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అక్కడ ఆయన్ను బల్లెంతో పొడిచి చంపారు.

ఆలయ నిర్మాణం

సెయింట్ థామస్ మౌంట్ ఆలయం
పూర్వం ఈ కొండ ప్రాంతంలో విదేశీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దీనిని 'పరంగి మలై'  (తమిళంలో 'పరంగి' అంటే పాశ్చాత్యులు, 'మలై' అంటే కొండ అని అర్థం) అని పిలిచేవారు. సుమారు 300 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండపై క్రీస్తు శకం 1523 వ సంవత్సరం పోర్చుగీసు వాళ్ళు తోమా స్మారకం గా చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడే తోమా మరణించడంతో ఈ కొండకు అప్పట్లో ఆయన పేరుతోనే సెయింట్ (పవిత్ర) థామస్ మౌంట్ అని పిలిచారు. ప్రస్తుతం ఆ పేరు స్థిరపడిపోయింది.  ఇక్కడి ఆలయాన్ని 1548 వ సంవత్సరం పెద్ద ఆలయంగా అభివృద్ధి చేశారు.

ఆలయంలోని విశిష్టతలు

లూకా గీసిన చిత్రం 
ఈ ఆలయంలో తోమ ఆస్థి పంజరం అవశేషంలోని ఓ చిన్న పాటి ఎముకని భద్రంగా ఉంచారు. భక్తుల సందర్శనం కోసం దానిని ఓ శిలువ ఆకారం మధ్యలో ఏర్పాటు చేసిన అద్దంలో ఉంచారు. ఆలయంలో కనిపించే బాల ఏసుని ఎత్తుకున్న మరియమ్మ చిత్రపటానికి కూడా ప్రత్యేకత ఉంది. దానిని బైబుల్ ను  రాసినవారిలో ఒకరైన లూకా చిత్రీకరించారు. దానిని మత ప్రచార వ్యాప్తి నిమిత్తం వచ్చే 
రక్తం స్రవించే శిలువ శిల్పం 
సందర్భంలో తోమ తనతో పాటే తీసుకు వచ్చాడు. అలాగే ఆలయంలో కనిపించే శిలువ శిల్పానికి  కూడా ప్రత్యేకత ఉంది. దాని నుంచి రక్తం స్రవించడమే అందుకు కారణం. 1547 వ సంవత్సరం ఆలయ పునరుద్ధరణ సమయంలో దానిని కనుగొన్నారు. ప్రార్థన నిమిత్తం దానిని తోమ స్వయంగా తయారు చేసినట్లు విస్వశిస్తున్నారు. 1558 వ సంవత్సరం, 1704 వ సంవత్సరాల్లో ఆ శిలువ నుంచి రక్తం స్రవించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ శిలువ చిత్రంతో భారత తపాలా  తెలిగ్రాఫ్స్  విభాగం 1972  వ సంవత్సరం  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

అంతర్జాతీయ ఖ్యాతి
రక్త స్రావ శిలువ శిల్పంతో తపాలా స్టాంపు
ఈ ఆలయాన్ని 1986 ఫిబ్రవరి 5 వ తేది అప్పటి రెండో పోప్ జాన్ పాల్ సందర్శించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని అంతర్జాతీయ క్రైస్తవ పవిత్ర స్థలం గా గుర్తించారు. ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల దారిలో క్రీస్తు జీవితానికి సంబంధించిన కొన్ని శిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ కొండకు ఆనుకొనే చెన్నై (మీనంబాక్కం) విమానాశ్రయం ఉంది. అలాగే మిలటరీ ఆఫీసర్స్ ట్రైనింగ్ (ఓ.టీ.ఎ) కూడా ఈ కొండ వద్దే ఉంది.

పార్థసారథి ఆలయం

దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి గాంచిన 108  వైష్ణవ ఆలయాల్లో ఒకటి చెన్నైలో ఉంది. ఇక్కడి ట్రిప్లికేన్ లోని  ఈ ఆలయమే పార్థసారథి ఆలయం. ఇక్కడ స్వామీ వారు పార్థసారథి. (మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం సమయంలో  పార్థుడి (అర్జునుడి)కి రథ సారథిగా ఉండటంతో శ్రీ కృష్ణుడిని పార్థసారథి అని కూడా పిలుస్తారు). ఇక్కడి స్వామి మీసాలతో దర్శనం ఇవ్వడం విశేష అంశం.

ఆలయ నిర్మాణం

పార్థసారథి ఆలయం
చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8 వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తుంది. నగరంలోని ప్రాచీన కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఆలయంలో పార్థసారథితో పాటు శ్రీ దేవవల్లి అమ్మవారు, శ్రీ రంగనాథుడు, శ్రీ రాముడు, శ్రీ వరదరాజ స్వామి, యోగ నరసింహుడు, శ్రీ అండాళ్, శ్రీ ఆంజనేయుడు, ఆళ్వారులు, రామానుజుడు తదితరుల సన్నిధులు ఉన్నాయి. ఆలయంలో పార్థసారథి మరియు నరసింహుడికి వేర్వేరు ధజస్తంబాలు, వాకిళ్ళు   ఉన్నాయి.

పురాణ ప్రాశస్త్యం 
మూల విరాట్టు 
సుమతి అనే రాజుకు పార్థసారథిగా దర్శనమివ్వనున్నట్టు వేంకటాచలపతి ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రిప్లికేన్ లో దర్శనం ఇచ్చాడని, ఆ మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ఓ కథ ప్రచారంలో ఉంది. ఆలయంలోని మూల విరాటుని మహాముని అగస్త్యుడు ప్రతిష్టించాడని ప్రతీతి. వైష్ణవ ఆచార్యుడు అయిన శ్రీ రామానుజుడు తల్లితండ్రులు ఇక్కడి పార్థసారథిని వద్ద సంతాన భాగ్యం కోసం ప్రార్ధించారని, దీంతో  ఆయనే వారికి రామనుజుడిగా జన్మించాడని కూడా ప్రతీతి. ఇక్కడి స్వామివారు మీసాలతో దర్శనం ఇవ్వడం తో పాటు
ఆలయ ప్రాకరంపై గీతోపదేశం శిల్పం
 చేతిలో తన ప్రధాన  ఆయుధమైన సుదర్శన చక్రం లేకుండానే దర్శనం ఇవ్వడం మరో విశేషం. కురుక్షేత్ర సంగ్రామంలో తను ఆయుధం పట్టబోనని వాగ్దానం చెయ్యడం అందుకు కారణమని చెబుతారు.


ఉత్సవం, దర్శన వేళలు

వైకుంట ఏకాదశి ఉత్సవాలు ఇక్కడ వేశేషంగా జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో ఒకరోజు మాత్రం స్వామివారిని తిరుపతి వేంకటాచలపతి తరహాలో అలంకరిచి భక్తులకు ప్రసాదంగా స్వీట్లు పంచి పెడతారు. మిగతా రోజుల్లో పొంగలి, దద్ధోజనం, పులిహొర, వడ అందిస్తారు.  12 మంది ఆళ్వార్లలో ముగ్గురైన పేయాళ్వార్, తిరుమళిసై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఈ ఆలయంలోని దైవాలపైన స్తుతి చేస్తూ పాటలు రాశారు.



వళ్ళువర్ కోట్టం

రథం పైభాగంలోని తిరువళ్ళువర్ విగ్రహం
తమిళ ప్రాచీన కవి, తిరుక్కురళ్  సూక్తులు ద్వారా తమిళానికి సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే ఖ్యాతి కల్పించిన తిరువళ్ళువర్ కు గౌరవం కల్పించే విధంగా చెన్నైలో వళ్ళువర్ కోట్టం ను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. నగరంలోని కోడంబాక్కంలోని పెరు తెరు (పెద్ద వీధి), విల్లేజ్ వీధుల కూడలిలో 1976 వ సంవత్సరం దీనిని నిర్మించారు. వి.గణపతి స్తపతి ఆధ్వర్యంలో దీని నిర్మాణ పనులు జరిగాయి. 
రథం



రథం: వళ్ళువర్ కోట్టంలో రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రసిద్ధి చెందిన తిరువారూరు ఆలయం రథం పోలికతోనే దీనిని నిర్మించారు. 128 అడుగులు (39 మీటర్లు) ఎతైన ఈ రథం ఎదుట నల్ల రాతితో చేసిన ఏడు అడుగుల ఎత్తు కలిగిన రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ రథం చక్రాలు ఒక్కొక్కటి 11 .25 అడుగులు ఎత్తు ఉన్నాయి. ఇదే రథం పై భాగంలో 30 అడుగుల  ఎత్తులో తిరువళ్ళువర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఉన్న రథం భాగం మాత్రమే 40 అడుగుల వైశాల్యం కలిగి ఉంది. రథం పక్కనే నిర్మించిన ఆడిటోరియం పై భాగానికి చేరుకుంటే దాని పైనే ఈ తిరువళ్ళువర్ విగ్రహం నిర్మించినట్టు భ్రమ కలుగుతుంది. ఆ విధంగా ఆడిటోరియం, రథాన్ని పక్క పక్కనే నిర్మించారు. రథం కింది భాగంలో తిరుక్కురళ్ పద్యాల భావాలను వివరించే విగ్రహాలు ఉన్నాయి.

ఆడిటోరియం 
ఆడిటోరియం ముందు భాగం
220 అడుగుల ఎత్తు, 100  అడుగుల వెడల్పుతో ఆడిటోరియం నిర్మించారు. ఆడిటోరియం పై భాగానికి వెళ్ళే మార్గంలో 1330  తిరుక్కురళ్ సూక్తులు చెక్కిన నల్ల రాతి పలకలు ఏర్పాటు చేశారు. ఈ చోటుకు కురళ్ మని మాడం అని పెరు పెట్టారు. 
ఆడిటోరియం పై నుంచి రథం పై భాగం
ఆడిటోరియం పై భాగానికి  చేరుకోగానే తిరువళ్ళువర్ విగ్రహం ఉన్న రథం పైకప్పు స్పష్టంగా కనిపించే విధంగా ఆడిటోరియం పైభాగం నేలపై  ప్రత్యేక ఏర్పాటు చేశారు. వళ్ళువర్ కోట్టం ప్రాంగణంలో అందమైన చెట్లు, మొక్కలు ఏర్పాటు చేయటంతో ఈ చోటు ఓ అందమైన పార్కు తరహాలో కూడా భావన కల్పిస్తుంది. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా కాలక్షేపం కోసం ఇక్కడకు వచ్చి సేద తీరుతూ ఉండటంతో ఈ ప్రాంతం నిత్యం  కళకళలాడుతూ  కనిపిస్తుంది.

మెరీనా బీచ్

తమిళనాడులోని చెన్నైలో ఉన్న మెరీన బీచ్  ఉత్తరంలో ఉన్న సెయింట్ జార్జ్ ఫోర్ట్ సమీప ప్రాంతం నుండి దక్షిణంలోని ట్నాయో గార్ వరకు 13 కిలోమీటర్లు మేరకు విస్తరించింది. ఇది బంగాళాఖాతం తీర ప్రాంతం. ఇది ప్రపంచంలోని రెండో అతి పొడవైన బీచ్ గా ప్రచారంలో ఉన్నా అది అధికారిక ప్రకటన మాత్రం కాదు.

చరిత్ర

1881 వ సంవత్సరం ఓడరేవు నిర్మించే వరకు చాలా కాలంపాటు ఈ బీచ్ ప్రస్తుత రహదారికి చాలా సమీపంగా విస్తరించి ఉండేది. 1881 నుండి 1886 వరకు మద్రాస్ గవర్నర్‌గా వ్యవహరించిన మౌంట్‌ స్టార్ట్ ఎల్ఫిన్‌స్టోన్ గ్రాంట్ డఫ్ ఈ బీచ్ వెంబడి విహార ప్రదేశాన్ని నిర్మించడంతో పాటు దానికి మద్రాస్ మెరీనా అని పేరు పెట్టాడు. 


ప్రస్తుతం 


మెరీనా బీచ్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. చెన్నైకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఈ బీచ్‌ను సందర్శిస్తారు. ఇక్కడ స్మారకాలు, విగ్రహాలు, ఉదయం పూట వాహ్యాలీ, జాగర్ల ట్రాక్, పచ్చిక స్థలాలు వంటివి ఏర్పాటు చెయ్యడంతో ఈ బీచ్  అన్ని వయస్సుల వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తుంది. ఈ బీచ్ లో స్నానం చేయటం / ఈత కొట్టడం నిషిద్ధం. ఇక్కడి గాంధీ విగ్రహం వెనుక ఓ స్కేటింగ్ రింక్ ఉంది. కార్మిక విగ్రహం నుంచి లైట్ హౌస్ వరకు 2.8 కిలో మీటర్ల దూరం మేరకు  కూర్చోడానికి వీలుగా 14 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అన్నా స్క్వేర్ నుండి లైట్ హౌస్ వరకు 3-కిమీ పొడవున ఆటంకం లేని కాలిబాట ఉంది. తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన "చెన్నై ఫర్ ఎవర్"లో భాగంగా 2005 సెప్టెంబరులో 1.5 మిలియన్ రూపాయలతో 34 అడుగుల ఎత్తైన, కృత్రిమ జలపాతం మెరీనాలో ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ అన్నా స్విమ్మింగ్ పూల్, మెరీనా స్విమ్మింగ్ పూల్, అక్వేరియం, మెరీనా క్రికెట్ గ్రౌండ్, డాక్టర్ అనిబెసెంట్ పార్క్ ఉన్నాయి. 



స్మారకాలు, కట్టడాలు


అన్నాదురై సమాధి 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎమ్జీఆర్ గా  ప్రసిద్ధమైన ఎమ్జీ రామచంద్రన్ సమాధులు ఈ బీచ్ లోనే ఉన్నాయి. వీటిని సుందర నిర్మాణాలుగా తీర్చి దిద్ధటంతో  నిత్యం బీచ్ కు వచ్చే వేలాది మంది వీటిని సందర్శిస్తున్నారు.
ఎమ్జీఆర్ సమాధి
దీంతో నిత్యం సందర్శకులతో ఇవి రద్దీగా కనిపిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన జవానుల నివాళుల నిర్మించిన విక్టోరియా వార్ మెమోరియల్ కూడా ఈ బీచ్ వద్దే ఉంది. భారత దేశంలోని ప్రాచీన 

మద్రాసు విశ్వవిద్యాలయం 
విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మద్రాసు విశ్వవిద్యాలయం, దేశంలోని ప్రాచీన కళాశాలల్లో ఒకటైన ప్రెసిడెన్సీ కళాశాల కూడా ఈ బీచ్ పక్కనే ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని 

1851 వ సంవత్సరం ప్రారంభించారు. అలాగే వివేకానంద స్వామి చికాగో పర్యటనకు ముందుగా చెన్నైలో బస చేసిన ఐస్ హౌస్ భవంతి ఇక్కడే ఉంది. ప్రస్తుతం దీనిని వివేకానంద హౌస్

చారిత్రిక నాయిక కన్నగి
గా పిలుస్తుండగా ఇక్కడ వివేకానంద జీవిత చరిత్రకు సంభందించిన పుస్తక, వస్తు ప్రదర్శన కూడా శాస్వతంగా ఏర్పాటు చేశారు. ఇదే బీచ్ వెంబడి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయమైన డీజీపీ కార్యాలయం ఉంది. బీచ్ పొడువునా ఉన్న కామరాజర్ రోడ్డు వెంబడి తమిళ సాహితీ, రాజకీయ, కళా రంగానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు కూడా చూడొచ్చు.